నవతెలంగాణ-హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల బాట పట్టాయి. వరుసగా ఏడో రోజు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్ 487 పాయింట్లు పుంజుకొని 80,086 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 139 పాయింట్లు ఎగబాకి 24,306 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, జియో ఫైనాన్షియల్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. గ్రాసిమ్, కొటక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా స్టాక్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావం మన మార్కెట్లపై కనిపిస్తోంది.
- Advertisement -