- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కోటి మొక్కలు నాటి వనజీవినే, తన ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితుడు రామయ్య అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనజీవి మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి లోటని భట్టి అన్నారు.