- Advertisement -
నవతెలంగాణ – విజయవాడ : విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం ‘యుద్ధ వ్యతిరేక’ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రకాష్ కారత్ విచ్చేశారు. ఎంబివికె ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌ను ప్రకాష్ కారత్ ప్రారంభించారు. ‘ ఇరాన్ పై దాడి – అమెరికా , ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదం దురహంకారం ‘ అంశంపై రాష్ట్ర సెమినార్ ప్రారంభమైంది. ముందుగా ప్రజా నాట్యమండలివారు గీతాలాపన చేశారు. అనంతరం సదస్సులో వక్తలు ప్రసంగిస్తున్నారు.


- Advertisement -



