నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజకీయాల్లో పాతతరం అంతరించిపోయిందనీ, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి రావాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ‘విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం’ అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయన్నారు. గడిచిన పదేళ్లలో దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వ పాలసీలపై లోతుగా చర్చించాల్సి ఉందని చెప్పారు. చట్టసభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా రావడం లేదన్నారు. విపక్షాలు తమ గొంతు వినిపించేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సి వస్తోందని వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి నోవాటెల్‌లో రెండోరోజు భారత్ సమ్మిట్ ప్లీనరీ ముగింపులో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య రాజకీయాలు మారిపోయాయి. పదేళ్ల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. మోడ్రన్ సోషల్ మీడియాతో అంతా మారిపోయిందనీ, ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమేనన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టానని గుర్తు చేశారు. పాదయాత్ర మొదట్లో తనతో కొద్ది మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. రోజులు గడుస్తున్న కొద్దీ తనతో వేలాది మంది నడిచారని గుర్తు చేశారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించి విజయం సాధించినట్టు తెలిపారు. దేశ ప్రజలకు ప్రేమను పంచేందుకు పాదయాత్రను మొదలు పెట్టామన్నారు. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టు చెప్పారు.
విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం: రాహుల్‌గాంధీ
- Advertisement -
RELATED ARTICLES