Wednesday, April 30, 2025
Homeజాతీయంవిపత్తు నిర్వహణపై ఉన్నతస్థాయి కమిటీ

విపత్తు నిర్వహణపై ఉన్నతస్థాయి కమిటీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: విపత్తు నిర్వహణపై ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం బుధవారం నియమించింది. ఈ కమిటీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షత వహించనున్నారు. వ్యవసాయ- రైతు సంక్షేమ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, నీతి అయోగ్‌ ఉపాధ్యక్షులు సుమన్‌ బెరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2005 విపత్తు నిర్వహణ చట్టం (2005లో 53) సెక్షన్‌ 8బిలోని సబ్‌ సెక్షన్‌ (2) అధికారాలను వినియోగించుకుని ఈ కమిటీని నియమించినట్లు హోం శాఖ నోటిఫికేషన్‌ పేర్కొంది. విపత్తుల సమయాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు, సంస్థల మధ్య విధాన నిర్ణయాలను మార్గనిర్దేశం చేయడం, సమన్వయపరచడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img