- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సకాలంలో స్పందించి విమానంలోని ప్రయాణికులను అత్యవసర స్లైడ్‌ల సాయంతో బయటకు తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 294 మంది ఉన్నారు. వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై సిద్ధంగా ఉండగా.. విమానం ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ స్లైడ్స్ నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు.