Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంవియత్నాంకు విమానం

వియత్నాంకు విమానం

- Advertisement -

– శంషాబాద్‌ నుంచి హనోరుకి సర్వీసులు ప్రారంభం
నవతెలంగాణ-హైదారాబాద్‌

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి వియత్నాం రాజధాని హనోరుకు నేరుగా విమానసేవలు ప్రారంభమయ్యాయి. ఆమేరకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) ఈ సేవలకు శ్రీకారం చుట్టినట్టు గురువారం ప్రకటించింది. వియత్నాం ఎయిర్‌లైన్స్‌ 7 మే 2025 నుంచి ఈ నూతన సేవలను అందిస్తున్నది. హనోరులోని నోరు బారు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరే విమానం (విఎన్‌-984) ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం రాత్రి 11:45 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయిలదేరుతుంది. కాగా హనోరు స్థానిక సమయం ఉదయం 5:25 గంటలకు చేరుకుంటుంది. తిరిగి హనోరు నుంచి బయలుదేరే విమానం(విఎన్‌-985) అక్కడి సమయం సాయంత్రం 7:15 గంటలకు బయలుదేరి, ఇక్కడి సమయం రాత్రి 10:15కి హైదరాబాద్‌ చేరుకుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -