Tuesday, April 29, 2025
Navatelangana
Homeఎడిట్ పేజివీళ్లు ఏం మాట్లాడుతున్నారు!?

వీళ్లు ఏం మాట్లాడుతున్నారు!?

- Advertisement -

”ద్విజాతి సిద్ధాంతం (దేశాన్ని మతప్రాతి పదికన రెండుగా చీల్చడం) సామాన్య ముస్లింల సూత్రం కాదు. మా వక్ఫ్‌ చట్టం సామాజిక న్యాయ ముఖ్య ముందడుగు. దీని వ్యతిరేకత ప్రతిపక్ష బుజ్జగింపు రాజకీయం. భూ మాఫి యాలు, మతమౌఢ్యుల బుజ్జగింపుకు కాంగ్రెస్‌ ప్రభు త్వాలు వక్ఫ్‌ను వాడాయి. 2013 యుపిఎ వక్ఫ్‌ చట్టం రాజ్యాంగాన్ని దాటేసింది. ముస్లిం స్త్రీల హక్కులను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసింది. మాకొత్త వక్ఫ్‌ చట్టం ముస్లింలందరి, ప్రత్యేకించి వెనుకబడిన ముస్లింల గౌరవాన్ని నిలుపుతుంది, ప్రయోజ నాలను కాపాడుతుంది. ఇరవయ్యవ శతాబ్ద రాజకీయాలతో 21వ శతాబ్ద తరాలపై బరువు మోపలేము.” 8న ఢిల్లీలో ‘ఉదయిస్తున్న భారతం 2025’ శిఖరాగ్ర సభలో ప్రధాని ఉవాచ.
సావర్కర్‌ 1937లో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విభజనలో ముస్లింలంతా వేరే దేశానికి (అప్పటికి పాకిస్తాన్‌ పేరే లేదు) పోతే హిందువులే మిగులుతారు. ఇది హిందుదేశం అవుతుంది. అని ఆయన ఆలోచన. 1940లో జిన్నా నేతృత్వ ముస్లింలీగ్‌ ద్విజాతి సిద్ధాం తాన్ని అందిపుచ్చుక్నుది. 1946లో కాంగ్రెస్‌ ద్విజాతి సిద్ధాంతంపై చర్చను ప్రవేశపెట్టింది. దీన్ని వ్యతిరేకించి గాంధీ సభను బహిష్కరించారు. మౌలానా, నెహ్రూ తీర్మానాన్ని వ్యతిరేకించారు. తీర్మానం నెగ్గింది. నిబద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలుగా గాంధీ, నెహ్రూ, మౌలానాలు తీర్మానాన్ని గౌరవించారు. ‘జూన్‌ 3తీర్మానం’గా అది పేరు మోసింది. 2002 గుజరాత్‌ గోధ్రా మారణ హోమంలో స్త్రీలు, పిల్లలతో సహా రెండు వేల ముస్లింల క్రూరహత్యలు, వందల ముస్లిం స్త్రీల మానభంగాలు ముస్లింలకు న్యాయాలా? పౌరసత్వ సవరణ, మంజూరు మొదలగు చట్టాల్లో రాజ్యాంగ సమానత్వ అధికరణలను మోడీ తుంగలో తొక్కారు. పొట్టి అక్షరాల పేర్ల ప్రజావంచన మోడీ చతురత. తమ వక్ఫ్‌ చట్టానికి ఆశ అనే అర్థమొచ్చే ఉమీద్‌ అని పేరుపెట్టారు. ఆస్తులను, సంస్థ లను కాపాడుకునే హక్కును రాజ్యాంగ అధికరణ 26 మతాల కిచ్చింది. మోడీ తీసుకొచ్చిన సవరణలో వక్ఫ్‌బోర్డులో ముస్లిమే తరులు ఉంటారు. వీళ్లు ముస్లింల ఆస్తులను కాపాడతారా? ఉమ్మడి పౌరస్మృతిని ఆరాధించే సంఘ్ సర్కారు హిందు సంస్థల్లో హిందూయేతరులను నియమి స్తుందా? ఊడవడం మతకార్యం కాకున్నా తిరుమల పారిశుద్ధ్య పనిలో హిందువులే ఉండాలని, హిందు ప్రాంగణాల్లో హిందూయేతరులు అంగళ్లు పెట్టరాదని సంఘ్ యాగీ చేస్తోందే! మోడీ నియమాల ప్రకారం కనీసం ఐదేండ్లు ఇస్లాంను అనుసరించేవారే వక్ఫ్‌కు ఆస్తి దానం చేయాలి. ఈ రాజ్యాంగ వ్యతిరేక నియ మాన్ని ఇతర మత సంస్థలకూ వర్తిస్తారా? ‘ఉపయోగంతో ఆస్తి’ నియమాన్ని, భవిష్యత్తుకు సరే, గతానికి ఎలా వర్తిస్తారు? వక్ఫ్‌ ఆస్తి ధృవీకరణ జిల్లా రెవెన్యూ అధికారికి కట్టబెట్టారు. ఈయన సర్కారు మాట వినరా? దేశ మసీదులన్నిటినీ మందిరాలుగా చూస్తున్న సంఘ్, బీజేపీ సర్కార్ల ద్వారా జిల్లా అధికారులను లొంగదీసుకొని వక్ఫ్‌ ఆస్తులను కాజేయదా?ఈ వక్ఫ్‌ సామాజిక న్యాయానికి ఎలా ముందడుగు?
వేర్వేరు మతాల ఆస్తుల సంరక్షణ, నిర్వహణ సంస్థల నిర్మాణాలు వేర్వేరుగా ఉంటాయా? మోడీయా జాతీయ సంపద ద్రవ్యీకరణ చట్టం ప్రజల భూములను, ఆస్తులను, సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడానికే. మోడీ చట్టాలు, ప్రక్రియలు, మాటలు ముస్లింలకు వ్యతిరేకంగా వైదికులను రెచ్చగొట్టి ఓట్లు పట్టడానికే. ముస్లింక్రైస్తవులను అపౌరులను చేసేవే. చరిత్రను వక్రీకరించి మెజారిటి మతస్తులను మాయజేసి కుర్చీలో కొనసాగే దుర్మార్గాలే. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది మోడీ, షాల సర్కారే. ”2013 వక్ఫ్‌ చట్టం తర్వాత 18 లక్షల ఎకరాల వక్ఫ్‌ భూమి 21 లక్షలు పెరిగి 39 లక్షల ఎకరాలకు చేరింది. మా చట్టంలో వెనుకబడిన ముస్లిం తెగలకు, స్త్రీలకు ప్రాతినిధ్యం కల్పించాము. వక్ఫ్‌ దాతృత్వ సంస్థ. ఇందులో హిందువులుండచ్చు. హిందు దేవాలయాలు ధార్మిక సంస్థలు.వీటిలో ముస్లింలుండరాదు.” అదే సభలో దేశ గృహమంత్రి అమిత్‌షా ఉటంకించారు. ముస్లిం మాటెత్తితే షాబానొ మనోవర్తి తీర్పును ప్రస్తావిస్తారు. ముమ్మాటి తలాక్‌ చట్టంతో ముస్లిం మహిళలను ఉద్ధరించామంటారు. వక్ఫ్‌, దేవాలయాల చట్టాలను 1863లో బ్రిటిష్‌ రాజ్యం చేసింది. తర్వాత తత్కాలీన సవరణలు చేశారు. 2013లో వక్ఫ్‌ సవరణ అమలు నాటికి వక్ఫ్‌భూమి 4 లక్షలనుంచి 6లక్షల ఎకరాలు. అందులో డెబ్బయి శాతం ఆక్రమణల్లో ఉంది. 10ఏప్రిల్‌ 2025న బీజేపీ వక్ఫ్‌చట్టం చేసిననాటికి వక్ఫ్‌ భూమి 9.4 లక్షల ఎకరాలు. హిందు ఆలయాల భూమి ఇరవై లక్షల ఎకరాలు. వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం కల్పించినవారు పార్లమెంటు ఉభయసభల్లో, రాష్ట్రాల శాసనసభలు, మండళ్లలో తమ పార్టీ తరఫున ఒక్క ముస్లిం ప్రతినిధికీ అవకాశమివ్వలేదు. బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్రాల మంత్రివర్గాల్లో ఒక్క ముస్లిం మంత్రి లేరు. జూన్‌ 2016లో సంఘీయ రాష్ట్రవాది ముస్లిం మహిళా సంఫ్‌ు’ ముస్లిం వ్యక్తిగత చట్టం, షరియత్‌ ను చట్టబద్దీకరించమని సుప్రీంకోర్టును కోరింది. ముస్లిం స్త్రీల సామాజిక, ఆర్థిక స్థితి విషాద మని మోడీ సర్కారు కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చింది. ఈ ప్రచారంతోనే యూపీ ఎన్ని కల్లో బీజేపీ ముస్లిం స్త్రీల ఓట్లు పొందింది. దీన్ని చట్టం చేస్తే లాభమని దురాశించింది.
2002లో తక్షణ తలాక్‌ చెల్లదని, ఇది రాజ్యాంగబద్దం కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మహిళలందరికీ గృహహింస నిరోధక చట్టం-2005, భారత శిక్షాస్మృతి498(ఎ) వర్తిస్తాయి. సిపిసి 125 ప్రకారం భర్త భార్యాపిల్లలకు జీవనభృతి చెల్లించాలి. ముస్లిం స్త్రీలకు 39శాతం, ముస్లిం మహిళల చట్టం 39శాతం రక్షణ కల్పిస్తుంది. 2011 జనాభా లెక్కల్లో వివాహబంధంలో ఉన్న మహిళల్లో ముస్లింలు 87.8 శాతం, హిందువులు 86.2శాతం, క్రైస్తవులు 83.7శాతం, ఇతరులు 85.8శాతం. వీరిలో ఎక్కువ ముస్లిం స్త్రీలే ఉన్నారు. వితంతువుల్లో ముస్లింలు 11.1శాతం, హిందువులు 12.9శాతం, ,క్రైస్తవులు 14.6శాతం, ఇతరులు 13.3శాతం హిందువితంతువులే ఎక్కువ. విడాకులివ్వకుండా వదిలేయబడిన మహిళల్లో హిందువులు0.69శాతం, (యాభై ఏండ్ల క్రితం వదిలేయబడ్డ యశోదాబెన్‌ మోడీ వీరిలో ఒకరు.) ముస్లింలు 0.67శాతం, క్రైస్తవులు1.19శాతం, ఇతరులు 0.68. ఇక్కడా ముస్లింల కంటే హిందువులే ఎక్కువ. దేశంలో అనాథ మహిళల సంఖ్య 24.5 లక్షలు. వీరిలో హిందువులు 20 లక్షలు. మస్లింలు 2.80 లక్షలు, క్రైస్తవులు 90 వేలు, ఇతరులు 80 వేలు. హిందు అనాథ మహిళలు మథుర, వృందావన్‌, హరిద్వార్‌, వారణాసిలలో బతుకులీడిస్తున్నారు. లైంగిక, శ్రమదోపిడీలకు బలవుతున్నారు. దేశంలో 4.30 కోట్ల హిందు వితంతు వులున్నారు. ఇందరు ఏకవనితలు ఏడుస్తోంటే ఎప్పుడో బాధపడబోయే ముస్లిం మహిళలే మోడీకిి కన్పించారు. ఒకశాతం కంటే తక్కువ తలాక్‌ బాధితుల కోసం, సుప్రీంకోర్టు రెండుసార్లు రద్దు చేసిన తక్షణ తలాక్‌పై మోడీ చట్టం చేశారు. స్త్రీలందరికీ ఎందుకు న్యాయం చేయలేదు?”పార్లమెంటు భవనం మాదని ముస్లింలు అంటే వక్ఫ్‌ ప్రకారం దాన్ని వాళ్లకివ్వాల్సిందేనని’ దేశ గృహ, న్యాయ మంత్రులు నిండు పార్లమెంటులో అన్నారు. ఎంత అఘాయిత్య, అతిశయోక్త రెచ్చగొట్టే మాట! మోదీ,షాలు సత్యం చెప్పారా? వారి మాటలు నమ్మాలా? భారతపౌరులు తేల్చు కోవాలి. న్యాయవ్యవస్థ తనకు తాను (సుమోటా) విచారిచి అసత్య హరిశ్చంద్రులు రాజ్యాంగ బద్దంగా పాలనార్హులా కాదా అనేది నిర్ణయించాలి.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు