నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్ కింగ్స్ లెవన్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్ ఓపెనర్స్ పై రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. దీంతో పంజాబ్స్ కు పవర్ ప్లేలో నిరాశ ఎదురైంది. మూడు ఓవర్లకు 34-3 స్కోర్ తో పీబీకేఎస్ పీకలోతు కష్టాలోకి మునిగిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన శ్రేయస్సు, ఓదేరా(70) ఆచితూచి ఆడుతూ ఇన్సింగ్స్ ను చక్కదిద్దారు. సింగిల్స్ తీస్తూ రాజస్థాన్ బౌలర్లను ఎదురుకున్నారు. ఈలోపు శ్రేయస్సు(30) ఆవుట్ కాగా..శశాంత్(59) క్రీజులోకి రాగానే తన బ్యాట్‌కు పనిచెప్పాడు. వచ్చే రాగానే బౌండరీలతో మోత మోగించాడు. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తన ఆప్ సెంచరీతో పంజాబ్ 220 పరుగల భారీ స్కోర్ సాధించింది. రాజస్థాన్ బౌలర్లు దిస్పాండే 2వికెట్లు తీయగా, పరాగ్, మద్వేల్, హసరంగ తలా ఒక వికెట్ పడగొట్టారు.
శశాంక్, వదేరాల మెరుపులు..పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్
- Advertisement -
- Advertisement -