Wednesday, April 30, 2025
Homeసినిమా'శుభం' రిలీజ్‌కి రెడీ

‘శుభం’ రిలీజ్‌కి రెడీ

కథానాయిక సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన సొంత ప్రొడక్షన్‌ కంపెనీ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ‘శుభం’ అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 9న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సెన్సిబుల్‌, హ్యూమర్‌తో ఈ చిత్రం అందరినీ పాత కాలానికి తీసుకు వెళ్లేలా ఉంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి యువ ప్రతిభావంతులంతా కలిసి పని చేశారు. వివేక్‌ సాగర్‌ ఆకర్షణీయమైన నేపథ్య సంగీతం, క్లింటన్‌ సెరెజో అందించిన మెలోడీ పాటలు ఈ చిత్రానికి హైలెట్‌ కాబోతున్నాయి. ఆకర్షణీయమైన కథ చెప్పడంలో ‘శుభం’ సినిమాతో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సమంత నిబద్దత అందరికీ అర్థం అవుతోంది. ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌తో వినోదాన్ని అందించే చిత్రాలను రూపొందించడమే నా లక్ష్యం. ‘శుభం’ ఆ కోవలోకి చెందే చిత్రం అవుతుంది. ఈ సినిమా కోసం టీం ఎంతో కష్టపడింది. ఈ ప్రత్యేకమైన కథను అందరితో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాం. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. సకుటుంబ సమేతంగా ఈచిత్రాన్ని హాయిగా చూడొచ్చు’ అని సమంత అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img