నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు సన్నగిల్లుతున్నాయి. షరతులు లేని యుద్ధ సంధికి తాము సిద్ధమని రష్యా ప్రకటించగా..అందుకు ఉక్రెయిన్ దేశం ససేమిరా అంటుంది. షరతులతో కూడిన ఒప్పందం ఇరుదేశాల మధ్య ఉండాలని, ఖచ్చితమైన ఉక్రెయిన్ దేశ సరిహద్దును రష్యా గుర్తించాలని, భవిష్యత్‌లో ఆదేశం నుంచి ఎలాంటి ముప్పు రాకుండా నాటో కూటమిలో సభ్యత్వానికి పుతిన్ అడ్డురావొద్దని జెలెన్‌స్కీ అంటున్నారు. అదే విధంగా ఇంతవరకు ఆక్రమించిన భూభాగాలను రష్యా వదులుకోవాలని ఉక్రెయిన్ పేర్కొంది. కానీ ఈ తరహా ఆంక్షలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తలొగ్గడంలేదు. ఎలాంటి షరతులులేని యుద్ధ సంధికే పుతిన్ మొగ్గుచూపుతున్నారు. అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయాన్ని చెప్పినట్లు శుక్రవారం క్రెమ్లిన్ తెలిపింది. ఇప్పటికే పలు దఫాలుగా ఇరుదేశాల అధినేతలతో అమెరికా ప్రెసిడెంట్ చర్చలు జరిపారు. శనివారం ప్రోప్ అంత్యక్రియల అనంతరం రోమ్‌లో జెలన్‌స్కీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమై నేటికి కొనసాగుతుంది. రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని ఐదో వంతు భూమిని ఆక్రమించాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 10,000 మంది మరణించారు.
షరతులులేని సంధికి రష్యా సిద్ధం: పుతిన్
- Advertisement -