Tuesday, May 13, 2025
Homeసినిమా'షష్టిపూర్తి' విడుదలకు సిద్ధం

‘షష్టిపూర్తి’ విడుదలకు సిద్ధం

- Advertisement -

తండ్రి ఇళయరాజా స్వర సారధ్యంలో కొన్ని తమిళ పాటలు పాడిన యువన్‌ శంకర్‌ రాజా తొలిసారిగా ‘షష్టి పూర్తి’ సినిమా కోసం డైరెక్ట్‌గా తెలుగులో పాట పాడారు. ఆ క్రెడిట్‌, ఆ లక్‌ తమకు దక్కడం పట్ల చాలా ఆనందం వెలి బుచ్చారు నిర్మాత రూపేష్‌, దర్శకుడు పవన్‌ ప్రభ. రాజేంద్రప్రసాద్‌, అర్చన ముఖ్య తారలుగా, రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ హీరో, హీరోయిన్లుగా పవన్‌ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకం పై రూపేష్‌ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని మూడో పాట ‘రాత్రంతా రచ్చే, మరి నువ్వంటే పిచ్చే, నీ మాటే నచ్చే ..’ను విడుదల చేశారు. చైతన్య ప్రసాద్‌ రచించిన ఈ పాటను యువన్‌ శంకర్‌ రాజా, నిత్య శ్రీ ఆలపించారు. జంగ్లీ మ్యూజిక్‌ సంస్థ ఈ పాటను ఆన్‌ లైన్‌లో రిలీజ్‌ చేసింది. ఈ సందర్భంగా యువన్‌ శంకర్‌ రాజా మాట్లాడుతూ, ‘మా నాన్న సంగీత దర్శకత్వంలో ఈ తెలుగు పాట పాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా కూల్‌ సాంగ్‌. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -