Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుసంక్షేమ విరోధి బీఆర్‌ఎస్‌

సంక్షేమ విరోధి బీఆర్‌ఎస్‌

– ఎక్కడో చనిపోయిన జింక హెచ్‌సీయూలో చనిపోయినట్టు క్రియేట్‌
– ఏఐ ద్వారా ఏనుగులు సంచరిస్తున్నట్టు చూపించారు
– ఆ భూమిని రూ.30వేల కోట్లకే కాంగ్రెస్‌ బేరం పెట్టిందంటూ కేటీఆర్‌ దుష్ప్రచారం
– సబర్మతికి ఓ న్యాయం…మూసీకి మరో న్యాయమా? : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
రాష్ట్ర సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ పెద్ద విరోధిగా మారిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. అబద్ధపు ప్రచారంతో ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు మాజీ మంత్రి కేటీఆర్‌ కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో తొమ్మిదేండ్ల క్రితం రాజస్థాన్‌లో చనిపోయిన జింకపిల్లను చూపించి హెచ్‌సీయూలో చనిపోయినట్టు బీఆర్‌ఎస్‌ క్రియేట్‌ చేసిందని చెప్పారు. అక్కడ ఏనుగులు సంచరిస్తున్నట్టు ఏఐ ద్వారా చూపించి ప్రజల్లో అనుమానాలు రేకెత్తిం చారని వాపోయారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అన్నీ విషయాల్లో బాధ్యతాయుతంగా పని చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రకృతి కాలుష్యాన్ని తరిమి కొట్టేందుకు మూసీ ప్రక్షాళన చేపట్టబోతున్నట్టు తెలిపారు. మూసీ పరివాహక ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. ఇలాంటి వాస్తవాలన్నింటినీ మరుగునపరిచి బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని తమ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. రూ. 5200 కోట్ల భూమిని రూ.30వేల కోట్లకు చూపించారంటూ కేటీఆర్‌ అనడమేంటని ప్రశ్నిం చారు. సెక్యూరిటీ బ్యూరో ఆఫ్‌ ఇండియా అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ద్వారా చేసిన సర్వే ప్రకారం రూ.23వేల కోట్ల విలువ వచ్చిందని గుర్తు చేశారు. దాన్ని సెబీ, ఆర్‌బీఐ కూడా నిర్దారణ చేశాయన్నారు. ఐసీఐసీఐ కూడా రుణం ఇవ్వలేదని తెలిపారు. టీజీఐఐసీ మార్కెట్‌ ఫోర్‌ సెస్‌ ద్వారా 37 అంతర్జాతీయ సంస్థల నుంచి మ్యూచువల్‌ పెట్టుబడులు బాండ్ల ద్వారా ప్రభుత్వం సేకరించిందని చెప్పారు. తక్కువ వడ్డీతో ప్రభుత్వ సంక్షేమం కోసం నిధులు సేకరించిందని వివరించారు. బాండ్ల రూపంలో (5.12.2024) రూ.9,995 కోట్ల నిధులను సేకరించిందని గుర్తు చేశారు. ఎస్‌ఈబీఐలో రిజిస్టర్‌ అయిన మర్చంట్‌ బ్యాంకర్‌ను టీజీఐఐసీ నియమించుకుందని చెప్పారు. ట్రస్ట్‌ ఇన్వెస్ట్‌ ఇండిస్టీ సంస్థ ఇతర రాష్ట్రాలకు నిధులు సమకూర్చిందని తెలిపారు. రైతుల సంక్షేమం, రైతు భరోసా, రైతు రుణమాఫీకి ఆ నిధులను ఉప యోగించామని వివరించారు. సన్నబియ్యం కోసం రూ.947 కోట్లు ప్రభుత్వం ఉప యోగించిందని తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ విషం కక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరహాలోనే మూసీ ప్రక్షాళన చేస్తామంటే, బీజేపీ వద్దంటోందని విమర్శించారు. సబర్మతికి ఓ న్యాయం…మూసీకి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులను సబర్మతికి తీసుకెళ్లాలంటూ మీడియా అకాడమీ చైర్మెన్‌కు సూచించారు. ఆ తర్వాత వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img