నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి జమ్మూకశ్మీర్‌లోని టూరిజంపై పెను ప్రభావం చూపింది. తాజా దాడితో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. పర్యాటకులంతా పహల్గాం నుంచి తిరిగి వెళ్లిపోయారు. పలువురు స్థానికులు కూడా సురక్షిత ప్రాంతాలకు తిరిగి వెళ్లారు. దీంతో అక్కడి దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము బతికేదెలా అని స్థానికలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితి తమకు గతంలో ఎన్నడూ ఎదురుకాలేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా బతుకుతున్న స్థానికులు తమ జీనాధారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అక్కడి స్థానికుల్లో వివిధ దుకాణాల ద్వారా పర్యాటకులకు అవసరమైన వస్తువులను విక్రయిస్తూ కొందరు, హోటల్‌లు, రెస్టారెంట్‌ల ద్వారా పర్యాటకులకు భోజనం, బస సౌకర్యాలు కల్పిస్తూ మరి కొందరు జీవిస్తున్నారు. వారి దగ్గర వివిధ పనులు చేస్తూ పలువురు కూలీలు, కార్మికులు ఉపాధి పొందుతున్నారు.పర్యాటకులు రాక చిరు వ్యాపారులు, ఉపాధి లేక దుకాణాలు, హోటళ్లలో పనిచేసే చిరుద్యోగులు తాము బతికేదెలా అని ఆందోళన చెందుతున్నారు.
సంక్షోభంలో జమ్మూకశ్మీర్ టూరిజం
- Advertisement -