నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకురావాలనీ ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో సుమారు లక్షన్నరకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలుగు మరియు హిందీ ద్వితీయ భాషగా కొనసాగుతూన్నాయి . ఇప్పుడు సంస్కృతాన్ని తీసుకుని రావటం వల్ల సరైన బోధనా సిబ్బంది లేక విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో 10 వ తరగతి వరకు తెలుగు తెలుగును తప్పనిసరి చేస్తూ 2018 లో చట్టం తీసుకువచ్చింది. దీని ద్వారా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంస్కృతాన్ని నేర్చుకునే పరిస్థితి లేదు. ఇంటర్ లో సంస్కృతాన్ని తీసుకుని రావటం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. కావున ఇంటర్ బోర్డ్ సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకురావాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది.