నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ లోని కాంగ్రెస్ శ్రేణులపై బీజేపీ దాడిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. సత్యం-అహింస అంతిమ విజయం సాధిస్తాయని, వాటి ముందు అసత్యం,హింస నిలబడలేవని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. దాడులు మా యాత్రను అడ్డుకోని నిలుపుదల చేయలేవని, నిజాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి తమ పోరాటం కొనసాగుతుందని, సత్యమే జయతే అంటూ పోస్టు చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఓట్ అధికార్ యాత్ర నిర్వహించారు. ఆ ర్యాలీలో ఓ వ్యక్తి ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఇవాళ బీజేపీ ర్యాలీ చేపట్టింది. పాట్నాలోని కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ దుశ్చర్యను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులపై బీజేపీ నాయకులు జెండా కర్రలతో దాడి చేశారు.