Wednesday, April 30, 2025
Homeమానవిసమతుల్యంగా ఉండాలంటే..!

సమతుల్యంగా ఉండాలంటే..!

హార్మోన్ల అసమతుల్యత.. ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటోన్న సమస్య. దీని కారణంగా నెలసరి-ప్రత్యుత్పత్తి సమస్యలే కాదు.. జీర్ణ సంబంధిత సమస్యలు, బరువు పెరగడం, శక్తి కోల్పోవడం, మానసిక సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు.. వంటివి తలెత్తుతాయి. అయితే ఇన్ని అనారోగ్యాలకు కారణమయ్యే హార్మోన్లను తిరిగి సమతుల్యం చేసుకోవాలంటే.. ఆహారమే కాదు.. మనం అనుసరించే జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.
ఎండ పొడ.. తగలాల్సిందే!
నిద్ర లేచీ లేవగానే చాలామంది చేసే పని.. మొబైల్‌ పట్టుకోవడం. దీనివల్ల శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయులు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్‌. ఉదయాన్నే ఒత్తిడి దరిచేరితే.. ఇక ఆ రోజంతా చిరాగ్గానే గడపాల్సి వస్తుంది. కాబట్టి.. అటు ప్రశాంతంగా రోజును ప్రారంభిస్తూనే, ఇటు హార్మోన్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే లేలేత ఎండలో ఓ అరగంట గడపమంటున్నారు నిపుణులు. ఇది జీవ గడియారాన్ని ప్రేరేపించి.. భౌతిక, మానసిక, ప్రవర్తన పరంగా మార్పులు తీసుకొస్తుంది. తద్వారా చక్కటి జీవనశైలిని పాటించే అవకాశం ఉంటుంది.. ఇక ఇదే ఎండలో చిన్నపాటి వ్యాయామాలు చేయడం, నడక.. వంటివి చేస్తే మరీ మంచిది.
చెప్పుల్లేకుండా.. కాసేపు!
అడుగు తీసి బయటపెట్టామంటే చెప్పులు వేసుకోవాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు చాలామంది. కానీ ఉదయాన్నే కాసేపు చెప్పుల్లేకుండా నడవడం వల్ల హార్మోన్ల ఆరోగ్యం మెరుగుపడుతుం దంటున్నారు నిపుణులు.
ఈ వ్యాయామాలు చేస్తున్నారా?
రోజంతా ఉత్సాహంగా ఉండడంలో ఉదయాన్నే చేసే వ్యాయామాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ ప్రక్రియ హార్మోన్ల సమతుల్యతనూ ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బరువులెత్తడం, కార్డియో వ్యాయామాలు హార్మోన్ల స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయి. ఇటు శారీరక ఫిట్‌నెస్‌, అటు హార్మోన్ల ఆరోగ్యాన్నీ మెరుగుపరచుకోవచ్చంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img