హీరో ప్రియదర్శి, దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కాంబినేషన్‌లో రూపొం దిన సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ నెల 25న సమ్మర్ కూల్ స్పెషల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ‘మా శ్రీదేవి మూవీస్ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే సినిమా అవుతుంది. కంప్లీట్ ఎంటర్ టైనర్ తీయాలనే నా కోరిక ఈ సినిమాతో నెరవేరింది. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ నెల 25న మీకు రెట్టింపు ఆనందాన్ని కలిగించే విధంగా మా సినిమా థియేటర్లలో విడుదల కానుంది. నిజానికి ఈనెల 18న విడుదల చేద్దామనుకున్నాం. అయితే బయ్యర్ల సూచన మేరకు మరిన్ని మంచి థియేటర్ల సౌలభ్యత కోసం 25న వస్తున్నాం. ‘బలగం ‘, ’35’, ‘కోర్టు’ సినిమాలతో ప్రియదర్శి రేంజ్ పెరిగింది. మిమ్మల్ని ఈ సినిమాతో 100 శాతం ఎంటర్‌టైన్ చేస్తారాయన. నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది ఇంద్రగంటి మోహనకష్ణ మూవీ నాని ‘జెంటిల్‌మన్’, ఆ తర్వాత సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ . ఈ రెండూ కూడా మంచి పేరు, సక్సెస్ తెచ్చాయి. ఇప్పుడు ఆ విజయాలను ఈ సినిమా కొనసాగిస్తుంది. ఇలాంటి సినిమా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను’ అని తెలిపారు. ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘సారంగపాణి..’ రిలీజ్ ఎప్పుడంటే?
- Advertisement -
RELATED ARTICLES