Tuesday, April 29, 2025
Homeఅంతర్జాతీయంసింధూలో నీళ్లు పారకపోతే, రక్తం పారుతోంది: పాక్ మాజీ మంత్రి

సింధూలో నీళ్లు పారకపోతే, రక్తం పారుతోంది: పాక్ మాజీ మంత్రి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సింధూలో నీళ్లు పారకపోతే, రక్తం పారుతోంది” అని పాక్ మాజీ మంత్రి భారత్ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవల జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్, విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావ‌ల్ భుట్టో-జ‌ర్దారి ఈ వ్యాఖ్యలు చేశారు సింధీ నదీ జలాలు విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు. దాన్ని ఏకపక్ష నిర్ణయం అంటూ తోసిపుచ్చారు. “సింధూ జ‌లాలు మావే. అవి ఎప్ప‌టికీ మా నీళ్లే అని, ఆ న‌దిలో మా నీళ్లు అయినా పారాలి లేక మీ ర‌క్త‌మైనా పారాలి” అని బిలావ‌ల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఏ అంతర్జాతీయ సమాజం కూడా మోడీ “యుద్ధకాండ”ను, సింధూ జలాలు మళ్లించే ప్రయత్నాన్ని సహించదని భుట్టో అన్నారు. “భారతీయులే వేల సంవత్సరాల నాటి నాగరికతకు వారసులు అని మోడీ అంటున్నారు. కానీ, ఆ నాగరికత లర్కానాలోని మొహెంజో దారోలో ఉంది. మేం దాని నిజమైన సంరక్షకులం. మేం దాన్ని రక్షిస్తాం” అని చెప్పుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img