– ఐక్యరాజ్యసమితిలో చైనా రాయబారి
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ దేశాలను అమెరికా సుంకాల బూచి చూపించి బెదిరిస్తోందని చైనా ఆరోపించింది. ఐక్యరాజ్యసమితిలో చైనా రాయబారిగా పనిచేస్తున్న ఫూ కాంగ్ ఐరాస భద్రతా మండలి అర్రియా-ఫార్ములా సమావేశంలో ప్రసంగిస్తూ అమెరికా వైఖరిని ఎండగట్టారు. ప్రతీకార చర్యలు, నిస్పాక్షికత ముసుగులో అమెరికా ఆట ఆడుతోందని, ప్రపంచ దేశాలపై సుంకాలను విధించి అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య క్రమాన్ని అస్తవ్యస్తం చేస్తోందని మండిపడ్డారు. ఏదో మంచి చేస్తున్నట్లు చెబుతూ తన ప్రయోజనాలను కాపాడుకుంటోందని, వివిధ దేశాల చట్టబద్ధమైన ప్రయోజనాలను ఫణంగా పెట్టి తన ఆధిపత్య ఆకాంక్షలను ముందుకు తీసుకుపోతోందని దుయ్యబట్టారు. అమెరికా నిర్ణయాలకు ప్రతిగా చైనా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటోందని కాంగ్ ప్రశంసించారు. ట్రంప్ ప్రభుత్వం సుంకాల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శించారు. సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ (సీసీజీ) వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు వాంగ్ హుయావో కూడా అమెరికాపై విమర్శలు సంధిస్తూ డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలతో యావత్ ప్రపంచంపై అమెరికా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిందని చెప్పారు.
సుంకాలతో అమెరికా బెదిరింపులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES