నవతెలంగాణ – హైదరాబాద్: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీ.ఆర్. గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయన పేరును ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేశారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రోజు మే 14న నూతన సీజేఐగా జస్టిస్ బి.ఆర్. గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ గవాయ్ నవంబర్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ఆరు నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.
- Advertisement -