నవతెలంగాణ – ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని పాఠశాలలో విషప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందు చల్లారు. సిబ్బంది గమనించడంతో 30 మంది విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పాఠశాల హెచ్‌ఎం ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -