– గ్రామపంచాయతీ పాలన పుస్తకావిష్కరణలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైల్వే రిటైర్డ్ అధికారి కె.వి. రావు రచించిన గ్రామపంచాయతీ పాలనా పుస్తకం స్థానిక పాలనపై అవగాహన పెంచుకునేందుకు దోహదపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో గల సచివాలయంలోని తన చాంబర్లో ఆ పుస్తకాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. భారతదేశంలో పంచాయతీరాజ్ చరిత్ర మొదలుకొని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ సభలు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు, అర్హతలు, సర్పంచ్, సెక్రెటరీ నిధులు విధులు, గ్రామపంచాయతీలో పన్నులు, నిధుల వినియోగం, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్, గ్రామ ప్రగతి ప్రణాళిక లు.. ఇలా సమగ్ర విషయాలను క్రోడీకరించి పుస్తకాన్ని రూపొందించిన రచయిత కె.వి.రావును ఆమె అభినందించారు. భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ, స్థానిక ఎన్నికలకు తెలంగాణ సమాయత్త మవుతున్న సమయంలో ఇలాంటి పుస్తకం రావడం ఎంతో ఉపయోగకరమన్నారు.
స్థానిక పాలనపై అవగాహన పెంపునకు దోహదం
- Advertisement -
- Advertisement -