నవతెలంగాణ -భువనగిరి
భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్ రైల్వే అండర్ పాస్ దగ్గర ప్రమాదాలు నివారించాలని ఇందుకోసం స్పీడ్ బ్రేకర్లు వేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ( సీపీఐ) ఆధ్వర్యంలో పురపాలక సంఘం కమిషనర్ రామలింగం స్పందించి స్పీడ్ బ్రేకర్లు వేయించినందుకు సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 22 వ తేదీన మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేస్తూ ఆందోళన నిర్వహించామన్నారు. ఈ ఆందోళన ఫలితంగా కిసాన్ నగర్ రైల్వే అండర్ పాస్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారన్నారు ప్రస్తుతం స్పీడ్ బ్రేకర్లు వేయడంతో ప్రమాదాలు జరగటం లేదన్నారు. ప్రమాదాల నివారణ కోసం స్పీడ్ బ్రేకర్లు వేయించిన పురపాలక సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, నాయకులు దాసరి లక్ష్మయ్య, బద్దం వెంకట్ రెడ్డి, వర్రె సాయిలు పాల్గొన్నారు