– సెమీస్‌లో గాఫ్ చేతిలో ఓటమి
– మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్
మాడ్రిడ్ (స్పెయిన్): మాడ్రిడ్ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వైటెక్ (పొలాండ్)కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అమెరికా అమ్మాయి కొకొ గాఫ్ చేతిలో స్వైటెక్‌కు భంగపాటు తప్పలేదు. అలవోక విజయాలతో సెమీస్‌కు చేరుకున్న టైటిల్ ఫేవరేట్ స్వైటెక్‌ను నాల్గో సీడ్ కొకొ గాఫ్ చిత్తుగా ఓడించింది. తొలి సెట్‌ను 6-1తో ఏకపక్షంగా సొంతం చేసుకున్న గాఫ్.. రెండో సెట్లోనూ అదే జోరు పునరావృతం చేసింది. ఐదు బ్రేక్ పాయింట్లతో చెలరేగిన గాఫ్ పాయింట్ల పరంగా 57-26తో తిరుగులేని ఆధిక్యం సాధించి స్వైటెక్‌కు చెమటలు పట్టించింది. 6-1, 6-1తో వరుస సెట్లలో గెలుపొందిన కొకొ గాఫ్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఒక్క ఏస్ కొట్టిన స్వైటెక్.. గాఫ్ సర్వ్‌ను బ్రేక్ చేయటంలో విఫలమైంది. ఓవరాల్‌గా మ్యాచ్‌లో రెండు గేమ్ పాయింట్లు మాత్రమే గెల్చుకుని దారుణంగా నిరాశపరిచింది. టాప్ సీడ్ అరినా సబలెంక 7-6(7-4), 7-6(9-7) టైబ్రేకర్లలో వరుస సెట్లలో పైచేయి సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఉక్రెయిన్ అమ్మాయి ఎలినా స్విటోలినా 6-2, 6-1తో ముయోకపై గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్లో సబలెంకతో స్విటోలినా తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో రష్యా స్టార్ డానిల్ మెద్వదేవ్ నిష్క్రమించాడు. క్వార్టర్‌ఫైనల్లో కాస్పర్ రూడ్ చేతిలో 3-6, 5-7తో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. ముసెటి 6-4, 6-2తో అలెక్స్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు.
స్వైటెక్‌కు షాక్
- Advertisement -