Wednesday, April 30, 2025
Homeతెలంగాణ రౌండప్హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – ఆర్మూర్
హనుమాన్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శనివారం పట్టణంలో హనుమాన్ ఆలయాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమాన్ అంటే బలం, అనుగ్రహం, నిజాయితీ అని, వివిధ గ్రామాల్లో హనుమాన్ మాల ధరించిన స్వాములు పాదయాత్రగా మండుటెండలో కొండగట్టు వరకు వెళ్లువారు జాగ్రత్తగా వెళ్లాలని అన్నారు. హనుమాన్ ఆలయం లేని గ్రామం లేదని, గ్రామాలకు హనుమాన్ రక్షా అని నమ్ముతారని తెలిపారు. ప్రతి ఒక్క ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సర్వ సమాజ అధ్యక్షుడు కొట్టాల సుమన్, జాకీర్ధర్ శీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img