– నలుగురు సహచరులు కూడా…
– అయినా విచారం, నిరాశ లేవన్న అజహర్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత వైమానిక దళం జరిపిన దాడిలో పది మంది కుటుంబ సభ్యులు, నలుగురు సహచరులు మరణించారని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజ్‌హర్ తెలిపారని పీటీఐ వార్తా సంస్థ చెప్పింది. భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల వెనుక మసూద్ అజ్‌హర్ హస్తం ఉందన్న విషయం తెలిసిందే. అతన్ని ఐరాస భద్రతా మండలి అంతర్జా తీయ ఉగ్రవాదిగా పరిగణిస్తోంది. బహావల్‌పూర్‌లోని జైషే మహమ్మద్ కేంద్ర కార్యాలయం జామియా మసీద్ సుభాన్ అల్లాపై భారత దళా లు జరిపిన క్షిపణి దాడిలో అజ్‌హర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, కుటుంబం లోని ఐదుగురు పిల్లలు చనిపోయారు.
‘నా కుటుంబ సభ్యులలో పది మంది అల్లా ఆశీర్వాదం పొందారు. వీరిలో ఐదుగురు అమాయకులైన చిన్నారులు, నా సోదరి, ఆమె భర్త ఉన్నారు. నా స్కాలర్ (మేనల్లుడు) ఫాజిల్ భాంజే, ఆయన భార్య, నాకు ప్రేమపాత్రుడైన స్కాలర్ ఫాజిలా (భాంజీ)… నా ప్రియ సోదరుడు హుజైఫా, ఆయన తల్లి, మరో ఇద్దరు సన్నిహితులు చనిపోయారు. చనిపో యిన వారందరూ అల్లా అతిథులే. ఇందుకు నేనేమీ విచారించడం లేదు. నిరాశ చెందడం లేదు. ఆ పద్నాలుగు మంది సభ్యులలో నేను కూడా ఉండి ఉంటే బాగుండేది’ అని అజ్‌హర్ వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలియజేసింది.
10 మంది జైషే చీఫ్ కుటుంబ సభ్యుల హతం
- Advertisement -
- Advertisement -