Sunday, January 18, 2026
E-PAPER
Homeజాతీయంలక్నో-ఢిల్లీ జాతీయ రహదారిపై 10 వాహానాలు ఢీ

లక్నో-ఢిల్లీ జాతీయ రహదారిపై 10 వాహానాలు ఢీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు మరోసారి ఘోర ప్రమాదానికి కారణమైంది. అమ్రోహా జిల్లాలో ఆదివారం ఉదయం లక్నో-ఢిల్లీ జాతీయ రహదారి (NH-9) పై పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మందికి పైగా గాయపడ్డారు. గజ్రౌలా కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షాహ్వాజ్‌పూర్‌ దోర్‌ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత సమయం తర్వాత, పోలీసులు క్రేన్ల సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -