నవతెలంగాణ – కామారెడ్డి
పదవ తరగతి ఫలితాలలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అక్షర ఉన్నత పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఎం. ప్రణయ్ కిశోర్ 577 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలపగా ఎ. అభిజ్ఞ (564) మార్కులు సాధించి 2వ స్థానంలో కె. సిరిహుసిని (563) మార్కులు సాంధించి 3వ స్థానంలో పి. చక్రిక (562) మార్కులు సాధించి 4 వ స్థానంలో పి. విభవ సంస్కతి (561) మార్కులు సాధించి 5వ స్థానంలో నిలవగా 16 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి విజయ ఢంకా మోగించారు. వీరిని పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు సంగీతారెడ్డి, కరస్పాడెంట్ ఎస్. లోకేష్ రెడ్డి ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -