- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో కలకలం రేగింది. రాజస్థాన్ ఏటీఎస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో జైపూర్ సమీపంలోని అంబాబరి ప్రాంతంలో దాచిన సుమారు 10 వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక గోదాం, మరో ఇంటి ఆవరణలో వీటిని నిల్వ చేసినట్లు గుర్తించారు. గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్ర పన్నినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా.. వారిలో ఒకరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
- Advertisement -



