నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పహాడీ షరీఫ్ వద్ద సోమవారం శంషాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం, చేవెళ్ల ఎక్సైజ్ సిబ్బంది కలిసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 107 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్లకు చెందిన డ్రగ్ అండ్ డిసీస్ ఫ్రీ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఇతర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, ఏఎస్ శ్రీనివాసరెడ్డి ఈ దాడులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శంషాబాద్ డిటిఎఫ్ చేవెళ్ల ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ అభినందించారు.
107 నాన్ డ్యూటీ మద్యం బాటిళ్లుస్వాధీనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



