- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపులకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది. హెచ్‌ఎంలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18 లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీవరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.
- Advertisement -