Monday, April 6, 2026
E-PAPER
Homeఆటలు11 ప‌రుగుల‌కే ఎస్‌ఆర్‌హెచ్ మూడు వికెట్లు

11 ప‌రుగుల‌కే ఎస్‌ఆర్‌హెచ్ మూడు వికెట్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 9 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది. ల‌ఖ్‌న‌వ్ బౌల‌ర్లు ప‌వ‌ర్ ప్లేలో మూడు వికెట్ల‌తో విజృంభించారు. మ‌హ్మ‌ద్ ష‌మీ వేసిన బౌలింగ్‌లో అభిషేక్ శ‌ర్మ ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండ‌నే డ‌కౌట్ అయ్యాడు. ఆ త‌ర్వాత ష‌మీ బౌలింగ్‌లో సింగిల్ డిజిట్ ర‌న్‌కే టావిస్ హెడ్ పెవిలియ‌న్ వెళ్లాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్.. ప్రిన్స్ వేసిన మూడో ఓవ‌ర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 ఓవ‌ర్లు ముగిసేరికి ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ 13-3. క్రీజులో ప్ర‌స్తుతం లివింస్ట‌న్(1), క్లాసెన్ ఉన్నారు. ప‌వ‌ర్ ప్లేలోపే ఎస్‌ఆర్‌హెచ్ కీల‌క బ్యాట‌ర్లు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. గ‌త మ్యాచ్‌లో సూప‌ర్ జోష్‌లో ఉన్న‌ ఎస్‌ఆర్‌హెచ్ హోం గ్రౌండ్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్లో నిరాశ‌ప‌రుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -