- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ మధ్య నమోదైన 8 ప్రధాన కేసులను ఛేదించి, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 11 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 9 మంది ట్రేడింగ్ మోసాలకు, ఇద్దరు లోన్ మోసాలకు పాల్పడినట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ తెలిపారు. మొత్తం 117 కేసుల్లో 564 రిఫండ్ ఆర్డర్లను గుర్తించారు.
- Advertisement -



