Friday, October 3, 2025
E-PAPER
HomeNewsమ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 11మంది మృతి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 11మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్నా నదిలోకి ట్రాక్టర్‌ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంతో ఖాండ్వాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్‌ నదిలోకి దూసుకెళ్లిందన్నారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 11 మంది నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 14 మంది ఉంటారని భావిస్తున్నారు. స్థానిక గ్రామస్తుల సహాయంతో అధికారులు ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -