Friday, September 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఒక్కరోజే 11,930 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా: మంత్రి తుమ్మల

నేడు ఒక్కరోజే 11,930 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా: మంత్రి తుమ్మల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: యూరియా సరఫరాలపై వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, కమిషనరేట్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని RFCL ఎరువుల కర్మాగారాన్ని తిరిగి పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

నిన్న ఒక్కరోజే ఆర్‌సీఎఫ్, సీఐఎల్, KRIBHCO, IPL-DAMRA కంపెనీల నుండి 11,930 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుందని అన్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రానికి 23000 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చిందని అన్నారు. రేపటి వరకు CIL, IPL, RCF, GSFC, SPIC కంపెనీల ద్వారా మరో 5,680 మెట్రిక్ టన్నులు రానున్నాయని, అలాగే వచ్చే నాలుగు రోజుల్లో IFFCO, MCFL, CIL-Kakinada, SPIC, KRIBHCO, NFL-Yasa Unsal Sunar-Vizag, CIL-Forza Doria, IPL, Narmada, RCF, RCF-Trombay కంపెనీల ద్వారా 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానున్నదని వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రానికి వివిధ ఎరువుల కంపెనీల నుండి 11 రేకులు రవాణాలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ఎరువులు మిర్యాలగూడ,కరీంన‌గ‌ర్, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, ఆదిలాబాద్‌, తిమ్మ‌పూర్, వ‌రంగ‌ల్, సనత్‌నగర్ రైల్వే రేక్ పాయింట్లకు చేరుకుంటాయని అన్నారు. ఈ రేకులు ఈరోజు నుండి రేపటి వరకు క్రమంగా జిల్లాలకు చేరుతాయని కూడా తెలిపారు.
అదేవిధంగా, ఈనెల 12 నుంచి 18వ తేదీ వ‌ర‌కు మధ్యకాలంలో మరో 11 రేకులు రాకకు ప్లాన్ చేయబడ్డాయని మంత్రి వెల్లడించారు. వీటిలోని ఎరువులు మిర్యాలగూడ, కరీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, పెద్ద‌ప‌ల్లి, సనత్‌నగర్, నిజామాబాద్ రేక్ పాయింట్లకు చేరతాయని తెలిపారు. అక్కడి నుండి అవసరమైన జిల్లాలకు తరలించే ఏర్పాట్లు పూర్తిచేయబడ్డాయని అన్నారు.

రైతులకు ఎరువుల పంపిణీ అంతరాయం లేకుండా ఉండేందుకు రైతు వేదికలలో కూడా సేల్ పాయింట్లు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రిగారు తెలిపారు. ఎరువులు రాగానే వాటిని వెంటనే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు.

ఇక్రిశాట్ అధికారులతో మంత్రి భేటీ….

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి ఇక్రిశాట్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు తెలిపారు. ఈ రోజు సచివాలయం లో ఇక్రిశాట్ ప్రతినిధులతో మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా, ఇక్రిశాట్ సంస్థ ప్రతినిధులు చిక్కుళ్ళు, తృణధాన్యాల మెరుగైన రకాలతో పాటు, వివిధ పంటలలో తాము అమలు చేస్తున్న వ్యవసాయ సాంకేతిక పద్ధతులను మంత్రికి వివరించారు. ఇక్రిశాట్ తెలంగాణ రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింతగా ఎలా అభివృద్ధి చెందుతుందో కూడా వారు చర్చించారు. ఈ చర్చలపై సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ రంగంలో ఇక్రిశాట్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి ఇక్రిశాట్ తో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

ఇక్రిశాట్ తెలంగాణతో తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని, తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ లోని ఇక్రిశాట్ సంస్థను సందర్శించాల్సిందిగా ఆ సంస్థ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుని ఆహ్వానించింది. డిప్యూటీ డైరెక్టర్ జనరల్-రీసెర్చ్, డాక్టర్ స్టాన్‌ఫోర్డ్ బ్లేడ్, డాక్టర్ హరి కిషన్ సుడిలు మర్యాద పూర్వకంగా కలిసి మంత్రికి ఆహ్వానం అందజేశారు. అంతేకాకుండా, వ్యవసాయ పరిశోధనలో ఇక్రిశాట్ యొక్క పాత్రను ఇంకా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఈ రోజు సచివాలయంలో నేద‌ర్లాండ్ బెసేడ్ AI కంపెనీ ప్రతినిధులతో తుమ్మల నాగేశ్వర రావు కలిసారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణలో ఉన్న ప్రతి రైతు సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా, సంకేతికతను ఉపయోగించి ఒక యాప్ ను వృద్దిచేయాలనీ అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇప్పటికే వివిధ ప్రైవేట్ సంస్థలు వివిధ రకాల యాప్‌లతో ముందుకు వచ్చాయని, అలా కాకుండా వ్యవసాయశాఖనే స్వంతముగా ఒక యాప్ ను వృద్ధి చేసి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాల గురించి, పంటల యాజమాన్యంతో రైతులకు అనునిత్యము ఎదురయ్యే వివిధ సమస్యలకు వెంటనే పరిష్కారం లభించేలా (one stop solution) ఒక యాప్ ను AI రంగములో పనిచేస్తున్న సంస్థలతో కలిసి వృద్ధి చేయాల్సిందిగా ఆదేశించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -