నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్ గూఢచారి” యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం భారతదేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె పాకిస్తాన్‌లోని లాహోర్‌లో పర్యటిస్తున్న సమయంలో ఏకే-47 గన్‌మెన్లు సెక్యూరిటీగా ఉన్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈమెతో సహా మరో 11 మందిని కూడా గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఇప్పటి వరకు మూడుసార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చింది. హర్యానా పోలీసులు ఆమె డిజిటల్ పరికరాలను పరిశీలించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు జ్యోతి మల్హోత్రా ఫోన్, ల్యాప్ టాప్ సహా అన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె అందులోని మెసేజ్‌లు, డేటాని తొలగించినప్పటికీ, పోలీసులు 12 టీబీ డేటాను తిరిగి పొందగలిగారు.
జ్యోతి మల్హోత్రా ఫోన్, ల్యాప్‌టాప్‌ల్లో 12 టీబీ డేటా రికవరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES