Tuesday, May 13, 2025
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌పుర్ – బలోద బజార్‌ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 13 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు రాయ్‌పుర్‌ ఎస్పీ లాల్‌ ఉమ్మెద్‌ సింగ్‌ వెల్లడించారు. జనాలతో నిండి ఉన్న ప్యాసింజర్‌ వాహనాన్ని ట్రక్కు ఢీ కొట్టింది. చౌతియా ఛత్తిలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి రాయ్‌పుర్‌ వస్తుండగా వాహనం ప్రమాదానికి గురైనట్లు ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో 9 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -