- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడటం కలకలం రేపింది. ఇవాళ కస్టమ్స్, ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు జరిపిన తనిఖీల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. రహస్యంగా దాచి ఉంచిన 14.7 కిలోల గంజాయి లభ్యమైంది. అనంతరం వెంటనే అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



