నవతెలంగాణ-హైదరాబాద్ : కోల్‌కతాలోని రితురాజ్ హోటల్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరికొంత మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. హోటల్ భవనంలో మరికొంత మంది చిక్కుకున్నట్లు ఓ పార్టీ నేత తెలిపారు.
- Advertisement -