Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసోరాబ్జి ఫోచ్‌ఖానావాలా 144వ జయంతి

సోరాబ్జి ఫోచ్‌ఖానావాలా 144వ జయంతి

- Advertisement -

నవతెలంగాణ-సుల్తాన్‌ బజార్‌
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు సర్‌ సోరాబ్జి ఫోచ్‌ ఖానావాలా 144వ జయంతిని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కోఠిలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజినల్‌ కార్యాలయంలో రీజనల్‌ హెడ్‌ దిలీప్‌ కుమార్‌ బార్‌వాల్‌ పాల్గొని సోరాబ్జి పోచ్‌ ఖానావాలా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివా ళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సోరాబ్జి పోచ్‌ ఖానావాలా 1911 సంవత్సరంలో ముంబైలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొదటి శాఖను ప్రారంభించారని తెలిపారు. ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందిస్తూ అంచలంచలుగా సెంట్ర ల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలను విస్తరించాయని తెలి పారు. ఆయన అకుంఠిత దీక్ష పట్టుదల, క్రమశిక్షణలతో విశేషమైన కషి ఫలితంగా నేడు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4500 శాఖలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంద ని తెలిపారు. 8 కోట్ల మంది ఖాతాదారులకు విశ్వసనీయ మైన సేవలను అందిస్తూ ప్రజల ఆధారణను పోందు తుందన్నారు. దేశవ్యాప్తంగా 2025 మార్చి సంవత్సరా నికి 7 లక్షల 5 వేల కోట్ల లావాదేవీలను నిర్వహించిం దని, 2026 మార్చి 31 సంవత్సరానికి 8 లక్షల 25 వేల కోట్ల లావాదేవీలే లక్ష్యంగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండ ియా ముందుకు సాగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 32 వేల మంది సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికా రులు, ఉద్యోగులు సంస్థ అభివద్ధిలో గణనీయమైన పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ రీజినల్‌ హెడ్‌ విప్లవ్‌ దేవ్‌, చీఫ్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌ ఎ సురేష్‌, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్‌ దేవేంద్ర, జోనల్‌ ఆఫీస్‌ ఏజీఎం కనకరాజు, అభిజిత్‌, గుల్షన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad