నవతెలంగాణ-హైదరాబాద్ : వీసాల గడువు దాటిపోయినా తిరిగి స్వదేశాలకు వెళ్లిపోకుండా అక్రమంగా ఇక్కడే ఉంటున్న 15 మంది విదేశీయుల ను భారత్ వెనక్కి పంపింది. భారత్ వెనక్కి పంపిన 15 మందిలో ఇద్దరు బంగ్లాదేశీయులు, 12 మంది నైజీరియన్‌లు, ఒకరు ఐవరీ కోస్టుకు చెందిన వారు ఉన్నారు. ఢిల్లీ పోలీసులు నగరంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు మోహన్ గార్డెన్ ఉత్తమ్‌నగర్ ఏరియాలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న 15 మందిని గుర్తించి డిటెన్షన్ కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత నిర్వహించిన వెరిఫికేషన్‌లో వారు దేశంలో అక్రమంగా ఉంటున్నట్టు నిర్ధారణ అయ్యింది. దాంతో వారిని తిరిగి వారివారి దేశాలకు పంపాలని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాల మేరకు 15 మందిని తిప్పి పంపారు.
15 మంది విదేశీయులను వెనక్కి పంపిన భారత్..
- Advertisement -
RELATED ARTICLES