నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో 16మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నారాయణ్‌పూర్‌లోని సీనియర్ పోలీస్ అధికారుల ఎదుట బుధవారం సాయంత్రం వారు లొంగిపోయారని అన్నారు. ఈ 16మంది మావోయిస్టులు జనతన సర్కార్, చేతననాట్య మండలి మరియు మావోయిస్ట్ పంచాయితీ మిలీషియా సభ్యులు సహా వివిధ యూనిట్లకు చెందిన దిగువస్థాయి కేడర్లని అన్నారు. మావోయిస్ట్ గ్రూప్‌లకు రేషన్, మందులు సహా ఇతర ముఖ్యమైన వస్తువులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను అందించడం, ఐఇడిలను అమర్చడం, భద్రతాదళాల కదలికలపై నిఘా, తనిఖీలు నిర్వహించడం వంటి కార్యకలాపాల్లో పాల్గొనేవారని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ ఒక్కొక్కరికీ రూ.50,000 సాయం అందించామని, ప్రభుత్వం పాలసీ ప్రకారం .. పునరావాసం కల్పిస్తామని అన్నారు.
16మంది మావోయిస్టులు సరెండర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES