Saturday, May 10, 2025
Homeఅంతర్జాతీయంగాజాలో 16 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాలో 16 మంది పాలస్తీనియన్లు మృతి

- Advertisement -

నవతెలంగాణ – గాజా :  గాజాపై ఇజ్రాయిల్‌ అమానుష దాడులు కొనసాగుతున్నాయి. గురువారం జరిపిన దాడుల్లో సుమారు 16 మంది పాలస్తీనియన్లు మరణించారని, 24 గంటల్లో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వైద్య అధికారులు తెలిపారు. డీర్‌ ఎల్‌-బాలా, సెంట్రల్‌ గాజాలోని నుసీరాత్‌ శరణార్థి శిబిరాలపై గురువారం జరిపిన వేర్వేరు దాడుల్లో సుమారు ముగ్గురు మరణించారని మీడియా పేర్కొంది. గాజాకి తూర్పున ఉన్న షుజాయేలో కాల్పుల్లో మరో వ్యక్తి మరణింకచగా, పలువురు గాయపడ్డారని తెలిపింది. గాజాకు ఉత్తరాన బీట్‌ లాహియాలోని ఒక నివాసంపై ఇజ్రాయిల్‌ యుద్ధవిమానాలు జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలు సహా తొమ్మిది మంది మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంటి యజమానితో పాటు ఆతిథ్యం ఇచ్చిన వారు కూడా మరణించినట్లు పేర్కొంది. గాయపడిన వారిని ఇండోనేషియా ఆస్పత్రికి తరలించినట్లు నివేదించింది. బీట్‌లాహియాలో పలువురు నిరాశ్రయలులు ఆశ్రయం పొందుతున్నట్లు మీడియా ముందుగానే ప్రకటించింది. ఖాన్‌యూనిస్‌ నగరానికి పశ్చిమంలోని నిరాశ్రయుల గుడారాలపై ఇజ్రాయిల్‌ ఫిరంగులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఒక బాలిక మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -