Sunday, February 1, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర బడ్జెట్ అప్ డేట్స్

కేంద్ర బడ్జెట్ అప్ డేట్స్

- Advertisement -

ముగిసిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది.

స్టాక్ మార్కెట్కు ‘పన్ను’ దెబ్బ.. సెన్సెక్స్ 2 వేల పాయింట్ల పతనం
భారీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు
ప్యూచర్స్ ట్రేడింగ్పై ఎస్ టీని పెంచడంతో నష్టాల్లోకి
సెన్సెక్స్ సుమారు 2వేల పాయింట్లు పతనం
700 పాయింట్లకు పైగా పడిన నిఫ్టీ

ఆ 17 ఔషధాలపై పన్ను తగ్గింపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వార్షిక పద్దును లోక్‌సభలో సమర్పించారు. ఈ బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. క్యాన్సర్‌ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై పన్ను తగ్గించింది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ నుంచి బయో గ్యాస్‌ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్‌జీకి మినహాయింపు ఇచ్చింది. మైక్రో అవెన్స్‌పై, పౌర విమానాల విడిభాగాలపై పన్ను తగ్గించింది.  

దేశీయ యాత్రలపై ట్యాక్స్ తగ్గింపు

పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తాం: ఆర్థిక మంత్రి నిర్మల
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. జాతీయ పర్యాటక రంగ సంస్థ ఏర్పాటుతో పాటు, 20 పర్యాటక ప్రాంతాల్లో 10వేల మంది గైడ్‌లను నియమించనున్నట్లు చెప్పారు. సూక్ష్మ పరిశ్రమలకు రూ.2వేల కోట్లు, స్వయం సమృద్ధి భారతం పేరుతో రూ.2వేల కోట్ల ఫండ్ కేటాయించారు. ప్రభుత్వ కొనుగోలు ద్వారా MSMEలకు చేయూత అందిస్తామని, పులికాట్ సరస్సుకు ప్రాధాన్యత ఇచ్చి, అక్కడి పక్షులను వీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్ 2026-27: మూలధన వ్యయం రూ. 12.20 లక్షల కోట్లు

గ్లోబల్ క్లౌడ్ కంపెనీలకు 2047 వరకు పన్ను మినహాయింపు

ఎల్‌ఆర్‌ఎస్‌ కింద టీడీఎస్‌ 5 నుంచి 2శాతానికి తగ్గింపు

ఏడు నగరాల మధ్య హైస్పీడ్‌ కారిడార్లు

ముంబయి-పుణె

పుణె-హైదరాబాద్‌

హైదరాబాద్‌-బెంగళూరు

హైదరాబాద్‌-చెన్నై

ఢిల్లీ-వారణాసి

వారణాసి -సిలిగుడి

హైటెక్‌ టూల్‌ రూమ్స్‌ ఏర్పాటు

పరిశ్రమలకు విద్యాసంస్థలు అనుసంధానం

మెగా టైక్స్‌టైల్స్‌ పార్కులుఏర్పాటు

జౌళి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్‌ కోసం ప్రత్యేక కార్యాచరణ

మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు

గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయింపు

రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం

ఛాంపియన్‌ ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ

రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం

ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 మూడు కొత్త విద్యా సంస్థల స్థాపన

సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ ఆధారిత బడ్జెట్‌ ఇది

కర్తవ్యభవన్‌లో రూపొందించిన మూడో బడ్జెట్‌ ఇది నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం

అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూస్తాం!

2025 ఆగస్టు తర్వాత 350 సంస్కరణలు తీసుకు వచ్చాం!

ఆర్థిక ప్రణాళికలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉంది.

జీఎస్టీ, లేబర్‌కోడ్‌ తదితర రంగాల్లో సంస్కరణలు తెచ్చాం: నిర్మలా సీతారామన్‌

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు.

9వసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.

సంస్కరణలు కొనసాగిస్తున్నాం

7 శాతం వృద్ధితో ముందుకు సాగుతున్నాం : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

పవిత్ర మాఘపూర్ణిమ రోజున బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం

ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానిస్తున్నాం

ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్నాం

వికసిత భారత్‌లో భాగంగా యువత ఆకాంక్షలను అద్దం పట్టేలా బడ్జెట్‌ను తీసుకొచ్చాం

పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోంది: నిర్మలా సీతారామన్‌

మూడు కర్తవ్యాలతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దాం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -