- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గడ్లో ని సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నియాద్ నెలనార్’ పథకం ద్వారా ప్రభావితమై, 18 మంది నక్సలైట్లు ఈ రోజు లొంగిపోయారని ఎస్పీ కిరణ్ జి చవాన్ చెప్పారు. వీరిలో నలుగురు మావోయిస్టులు బెటాలియన్ నెంబర్ 1 తో సంబంధం కలిగి ఉన్నారు. ఈ రోజు 4 బెటాలియన్ కి చెందిన మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో దక్షిణ బస్తర్‌లో చురుకుగా ఉన్న మావోయిస్టులు కూడా ఉన్నారని, ప్రభుత్వ సూచనల మేరకు లోంగిపోయినవారికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని పథకాల ప్రయోజనాలను వారు పొందుతారని సుక్మా ఎస్పీ కిరణ్ జి చవాన్ రిక్వెస్ట్ చేశారు.
- Advertisement -