No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతాజా వార్తలుబాల్కనీలో నుంచి పడి 18 నెలల చిన్నారి మృతి

బాల్కనీలో నుంచి పడి 18 నెలల చిన్నారి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అంబర్‌పేట్ పటేల్ నగర్‌లోని శివాలయం వెనుక వీధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు శ్రేయాన్ష్ అనే 18 నెలల చిన్నారి బాల్కనీలో నుంచి పడి మృతి చెందాడు. అంబర్‌పేట ఎస్ హెచ్ ఓ కిరణ్ కుమార్ తెలిపిన సమాచారం ప్రకారం.. అంబర్‌పేట, పటేల్ నగర్ నివాసి బొల్లి రాజు (33, వ్యాపారి) కుమారుడు శ్రేయాన్ష్ (18 నెలలు) గురువారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో 2వ అంతస్తు బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రౌండ్ ఫ్లోర్‌లోకి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం గమనించిన తల్లిదండ్రులు వెంటనే సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 3:50 గంటలకు శ్రేయాన్ష్ మృతిచెందాడని ఆసుపత్రి డ్యూటీ వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై అంబర్‌పేట్ పోలీసులు 174 Cr.P.C. ప్రకారం UDR నమోదు చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad