- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్‌లో జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న బస్సు దగ్ధమై 20 మంది మృతి చెందారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు.
- Advertisement -