– అమెరికా యోచన
న్యూఢిల్లీ : భారత్‌పై అమెరికా 20 శాతం సుంకాలు విధించే అవకాశం ఉందని సమాచారం. ఇతర దేశాల మాదిరి భారత్‌కు సుంకం డిమాండ్ లేఖ రాకపోవచ్చని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వారు పేర్కొన్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. అమెరికా, భారత్ మధ్య చర్చలు గోప్యంగా ఉన్నందున పూర్తి వివరాలను వెల్లడించలేమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 20 శాతం కంటే తక్కువకు తగ్గించే ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం, భారత్‌పై బేస్‌లైన్ 10 శాతం, అదనపు సుంకం 16 శాతం కలుపుకుంటే మొత్తంగా 26 శాతం టారిఫ్ అమలవుతోంది. ముఖ్యంగా వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్స్ వంటి రంగాల్లోని టారిఫ్ సమస్యలపై ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం.
భారత్‌పై 20 శాతం సుంకాలు..!
- Advertisement -
- Advertisement -