కొచ్చి: జాతీయ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఒడిషాకు చెందిన అనిమేశ్ కుజుర్ 200మీ. పరుగులో జాతీయ రికార్డును బ్రేక్ చేశాడు. గురువారం జరిగిన 200మీ. పరుగు పందెం ఫైనల్లో అనిమేశ్ 20.40సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో గతంలో తన పేర ఉన్న 20.52సెకన్ల రికార్డు బ్రద్దలైంది. దీంతో ఆసియా ఖండంలో కుజురు ప్రథమస్థానంలో నిలిచాడు. అలాగే ప్రపంచంలోనే 200మీ. పరుగులో అత్యుత్తమ 35వ అథ్లెట్‌గా నిలిచాడు.
ట్రిపుల్ జంప్‌లో చిత్రవేల్ కూడా..: మహరాజా కాలేజీ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్‌లో చిత్రవేల్ తన పేర ఉన్న జాతీయ రికార్డును సమం చేశాడు. గురువారం జరిగిన ట్రిపుల్ జంప్ ఫైనల్లో చిత్రవేల్ 17.37మీ. దూకాడు. దీంతో క్యూబాలోని హవానా వేదికగా 2023లో జరిగిన కాన్ఫెడరేషన్ అథ్లెటిక్స్ పోటీల్లో చిత్రవేల్ తొలుత ఈ రికార్డును నెలకొల్పాడు.
200మీ. పరుగులో అనిమేశ్ జాతీయ రికార్డు
- Advertisement -